Share News

స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఎద్దు.. క్షణాల్లో షాకింగ్ సీన్ వీడియో వైరల్

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:45 PM

వాహనంపై వేగంగా వెళ్తున్నప్పుడు.. రహదారిపైకి కుక్క, పిల్లి వస్తే సడన్ బ్రేక్ వేస్తాం. అదే గేదె, ఎద్దు లాంటివి రహదారిపైకి అడ్డంగా దూసుకొస్తే.. గా సెడన్ బ్రేక్ వేయడం కూడా కుదరదు. దీంతో వాహనం మీద నుంచి కింద పడిపోతాం. అలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఎద్దు.. క్షణాల్లో షాకింగ్ సీన్ వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: వాహనంపై వేగంగా వెళ్తున్నప్పుడు.. రహదారిపైకి కుక్క, పిల్లి వస్తే సడన్ బ్రేక్ వేస్తాం. అదే గేదె, ఎద్దు లాంటివి రహదారిపైకి అడ్డంగా దూసుకొస్తే.. గా సెడన్ బ్రేక్ వేయడం కూడా కుదరదు. దీంతో వాహనం మీద నుంచి కింద పడిపోతాం. అలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రహదారి పక్కన రెండు ఎద్దులు కొమ్ములతో ఘర్షణ పడుతున్నాయి. వాటిని విడదీసేందుకు వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. మరో వ్యక్తి (ఈ వీడియోలో కనిపించడం లేదు) ఈ రెండు ఎద్దులపై నీళ్లు పోస్తున్నాడు. దీంతో వాటిలో ఓ ఎద్దు భయపడి వెనక్కి రహదారిపైకి వేగంగా పరుగు తీసింది.


అదే సమయంలో రహదారిపై వేగంగా ఓ యువతి స్కూటిపై వెళ్తోంది. ఈ ఎద్దు వెళ్లి.. ఆ స్కూటీని బలంగా ఢీ కొట్టింది. అంతే రహదారి పక్కన ఆగి ఉన్న కారును స్కూటీతోపాటు ఆమె ఢీ కొట్టి కింద పడిపోయింది. దీంతో అక్కడి ఆగి ఉన్న కారు.. ముందుకు కదిలింది. ఆ వెంటనే కింద పడిన ఆ యువతి లేచి కూర్చొంది. తనకు ఏం జరిగిందనే ఆలోచనలో ఆ యువతి ఉండిపోయింది. అందులో నుంచి తేరుకునేందుకు ఆమె కొంత సమయం పట్టింది.


ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌లో చోటు చేసుకుంది. ఈ వీడియోను అన్షుల్‌హిందూస్థానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి లైక్ కొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె గాయాల తీవ్రతపై ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకర ఘటన అని చెబుతున్నారు. ఈ ఘటనలో మహిళ గాయపడకుండా ఉండి ఉంటే అదృష్టవంతురాలని అంటున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 07:04 PM