Share News

మనుషుల్లాగానే కొట్టుకున్న ఎలుకలు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Apr 26 , 2026 | 07:11 PM

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు స్ఫూర్తినిస్తే, మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రెండు ఎలుకలు అచ్చం మనుషుల్లా కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మనుషుల్లాగానే కొట్టుకున్న ఎలుకలు.. వీడియో వైరల్..
Funny Animal Fight

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు స్ఫూర్తినిస్తే.. మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా, ఇలాంటి ఓ విచిత్రమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు ఎలుకలు అచ్చం మనుషుల్లాగానే కొట్టుకుంటున్న వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది. ఎలుకలు ప్రొఫెషనల్ రెజ్లర్స్ మాదిరిగా కొట్టుకోవడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.


వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రెండు ఎలుకలు ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ కనిపించాయి. కొంతసేపు పోట్లాడిన తర్వాత విడిపోయి, తలో దారిలో వెళ్లిపోయాయి. ఎలుకల మధ్య జరిగిన ఈ వింత ఫైటింగ్ సీన్‌ను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో @nareshk181 అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ 'ఎలుకల మధ్య పెద్ద విషయంపై గొడవ జరుగుతోంది, ఏది గెలుస్తుందో చూద్దాం' అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఇకపై ఎలుకల రెజ్లింగ్ పోటీలు పెట్టాలి’ అంటూ మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశారు.


Also Read:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..

నాయకత్వ మార్పుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : డీకే శివకుమార్

Updated Date - Apr 26 , 2026 | 07:42 PM