చిన్నారిని కాపాడేందుకు ఎద్దుతో పోరాటం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:25 AM
రాయ్‌పూర్‌లో వీధి ఎద్దు ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. ఇంటి బయట చిన్నారిని ఎత్తుకుని ఉన్న వృద్ధుడిపై దాడి చేయడంతో ఇద్దరూ కిందపడిపోయారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వీధి ఎద్దు దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఇంటి బయట ఓ వృద్ధుడు చిన్నారిని చేతుల్లో పట్టుకుని ఉండగా, అకస్మాత్తుగా వచ్చిన నల్ల ఎద్దు అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు, చిన్నారి ఇద్దరూ నేలపై పడిపోయారు. అయినప్పటికీ, ఆ వృద్ధుడు చిన్నారిని తనకు దగ్గరగా హత్తుకుని ఎద్దు నుంచి రక్షించేందుకు ప్రయత్నించాడు.
ఎద్దు మరోసారి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి మరింత భయానకంగా మారింది. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఎద్దును తరిమివేసేందుకు ప్రయత్నించారు. అనంతరం వృద్ధుడిని, చిన్నారిని సురక్షితంగా లోపలికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ వీడియో ‘హిందూవిజన్1’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేశారు. చిన్నారిని కాపాడేందుకు వృద్ధుడు చూపిన ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఆ వృద్ధుడి గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి..’ అని, ‘ఆ చిన్నారిని ఏమీ అనకపోవడం నిజంగా విడ్డూరం’ అని ఒకరు, ‘వీధుల్లో తిరిగే పశువుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..
భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం