Share News

రైల్వే బెడ్‌షీట్లతో షాపింగ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Aug 24 , 2026 | 03:23 PM

రైల్వే బెడ్‌షీట్లతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై షాపింగ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెస్ట్రన్ రైల్వే అని రాసి ఉన్న బెడ్‌షీట్లను శాలువాలుగా కప్పుకొని దుకాణం వద్ద తిరుగుతున్నారు..

రైల్వే బెడ్‌షీట్లతో షాపింగ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Railway Bed Sheets Viral video

ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్‌లో ముగ్గురు వ్యక్తులు ఇండియన్ రైల్వేస్‌కు చెందిన బెడ్‌షీట్లను శాలువాలుగా కప్పుకొన్నట్లుగా కనిపిస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బెడ్ షీట్లపై ‘Western Railway’ అని ముద్రించి ఉండటంతో ఈ వీడియోపై తీవ్ర చర్చ జరుగుతోంది. ‘జెమ్స్ ఆఫ్ రైల్వేస్’ అనే ‘X’ ఖాతాలో షేర్ చేసిన 21 సెకన్ల వీడియోలో ముగ్గురు వ్యక్తులు తమ భుజాలపై తెల్లటి బెడ్‌షీట్లను కప్పుకొని కిరాణా దుకాణం వద్ద కనిపించారు. వారు దుకాణం బయట వేలాడుతున్న చిప్స్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను చూస్తూ ఉన్నారు.


ఆ బెడ్‌షీట్లపై ‘వెస్ట్రన్ రైల్వే’ అనే నీలిరంగు రాసి ఉండడంతో పాటూ తేదీ, సంవత్సరం కూడా స్పష్టంగా కనిపించడంతో.. అవి రైల్వేకు చెందినవేననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీడియోను షేర్ చేసిన పోస్ట్‌లో.. రైలులోని బెడ్‌షీట్లను దొంగిలించి బయటకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. రైల్వే ఆస్తిని దుర్వినియోగం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగానే అవి రైల్వే బెడ్‌ఫీట్లేనా అనేదానిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

రైల్వే సిబ్బంది ఎవరైనా వాటిని అప్పగించారా? లేక విక్రయించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ప్రజలు సూచించారు. రైల్వే ఆస్తిని అక్రమంగా వినియోగించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లయితే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి..

వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

Updated Date - Aug 24 , 2026 | 03:52 PM