Share News

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:22 PM

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే తమ దేశం ముక్కలైపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు
President Zelensky on Ukraine elections

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే తమ దేశం ముక్కలైపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రక్షణ శాఖ మంత్రి సూచనను తోసిపుచ్చారు. ‘ఈ యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించడం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలంటే సునామీనే.. దేశం ముక్కలైపోతుంది. దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఎన్నికలకు వెళ్లొచ్చు’ అని జెలెన్‌స్కీ హెచ్చరించారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమలవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయానికి ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు.

ఇటీవల రక్షణ మంత్రి మిఖైలో ఫెడరోవ్‌ను జెలెన్‌స్కీ తొలగించడం ఉక్రెయిన్‌లో కలకలానికి దారి తీసింది. వందల మంది సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఫెడరోవ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఇందుకు కావాల్సిన ప్రణాళికను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు ఆయన మద్దతుదారులకు కూడా రుచించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పత్రికా సమావేశంలో జెలెన్‌స్కీ ఫెడరోవ్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఆయన తప్పుడు మార్గంలో వెళుతున్నట్టు ఉంది. లేదా ఎవరైనా ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారేమో’ అని జెలెన్‌స్కీ అన్నారు.


యుద్ధం విషయంలో మిలిటరీ అనుసరిస్తున్న వైఖరిని మాజీ మంత్రి ఫెడరోవ్ తప్పుబట్టడం తాజా వివాదానికి నాంది పలికింది. మొదట్లో సామాన్య ప్రజలు అనేక మంది ఫెడరోవ్‌కు మద్దతుగా నిలిచారు. జెలెన్‌స్కీ మాత్రం ఆర్మీని అవమానించవద్దని అన్నారు. అయితే, ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ‘సామాన్య ప్రజానీకానికి, సాయుధ దళాలకు మధ్య ఎడం పెరగకూడదని నేను నమ్ముతాను’ అని కూడా జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌ మిలిటరీ, నాయకత్వ తీరుతెన్నులను ఆధునికీకరించాలని ఫెడరోవ్ పట్టుబట్టారు. కానీ మిలిటరీ నాయత్వం ఈ సూచనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంతో చివరకు ఫెడరోవ్ తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 23 , 2026 | 06:09 PM