మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. జుట్టు పట్టుకుని, దారుణంగా కొట్టుకున్నారు
ABN , Publish Date - Sep 11 , 2026 | 08:46 AM
మహారాష్ట్రలోని పుణె జిల్లా ఆళందిలో భిక్షాటన విషయంలో రెండు ట్రాన్స్‌జెండర్ వర్గాల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆళందిలోని ఇంద్రాయణి నది ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె జిల్లా ఆళందిలో భిక్షాటన విషయంలో రెండు ట్రాన్స్‌జెండర్ వర్గాల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆళందిలోని ఇంద్రాయణి నది ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భక్తులు, స్థానికులు చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి అనంతరం కొట్లాటకు దారితీసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అదే రోజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా.. ఐదుగురు పేరున్న నిందితులతో పాటు మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం.. 26 ఏళ్ల యోగేష్ సతీష్ గణమోటే తన స్నేహితులతో కలిసి ఇంద్రాయణి నది ఘాట్ వద్ద భక్తులను భిక్ష అడుగుతున్న సమయంలో మరో వర్గంతో వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా తమను దూషించారని గణమోటే ఆరోపించారు. మాటామాటా పెరగడంతో గొడవ తీవ్రరూపం దాల్చిందని, తన తలపై ‘ఫైటర్’గా పిలిచే ఇనుప పిడికిలి కవచంతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఘర్షణ సమయంలో తనను ప్రాణాలతో చంపుతామని బెదిరించినట్లు కూడా ఆయన ఆరోపించారు. ఈ కేసులో నిగ్డి ప్రాంతానికి చెందిన పరి యాదవ్, సనమ్, ఖుషీ, రాణి, అంజలి పేర్లను పోలీసులు నిందితులుగా నమోదు చేశారు. పేర్లు, చిరునామాలు తెలియని మరో ఇద్దరిపైనా కేసు నమోదైంది.
ఇదిలా ఉండగా.. ఘర్షణ సమయంలో తమ విలువైన వస్తువులు కూడా కనిపించకుండా పోయాయని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 74, 118(1), 189(1), 352, 351(3), 115(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా స
హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!
For More Weather News And Telugu News