విమానం టేకాఫ్ అవుతుండగా దూసుకొచ్చిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే!
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:14 PM
విమానం టేకాఫ్ అవుతుండగా ఓ కారు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
ఇంటర్నెట్ డెస్క్: విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ కారు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. విమానం టేకాఫ్ కోసం ముందుకు కదులుతోంది.. రన్‌వే మార్గం కూడా ఖాళీగానే కనిపిస్తోంది. ఇంతలో ఓ తెల్లటి కారు వేగంగా విమానం వైపు దూసుకొచ్చింది. కారు ఆగుతుందని భావించినా.. వేగంగా వచ్చి క్షణాల్లోనే విమానం ముందు భాాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
కారు ఢీకొనడంతో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. కారు నడిపిన మహిళా ఉద్యోగి వయసు 54 ఏళ్లు ఉంటుందని తెలుస్తోంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందు జాగ్రత్తగా విమానాల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు.
ఈ వార్తలనూ చదవండి:
నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..