నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:22 PM
బెల్జియంకు చెందిన ఓ 18 ఏళ్ల కుర్రాడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. మురుగు నీటిపైపు లైన్ ఏర్పాటు కోసం నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారు బిస్కెట్స్, నాణేలు బయటపడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: బెల్జియంకు చెందిన ఓ 18 ఏళ్ల కుర్రాడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. మురుగు నీటిపైపు లైన్ ఏర్పాటు కోసం నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారు బిస్కెట్స్, నాణేలు బయటపడ్డాయి. బ్రసెల్స్‌కు 18 మేళ్ల దూరంలోని డెండెర్‌మోండే అనే ప్రాంతంలోగల ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రాంగణంలో వెలుగు చూసింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మురుగు నీటి పైపు లైన్ ఏర్పాటు చేసేందుకు కొందరు వర్కర్లు అక్కడ భూమిని తవ్వుతున్నారు. వారితో పనిచేస్తున్న ఓ 18 ఏళ్ల కుర్రాడికి మొదట కొన్ని నాణేలు కనిపించాయి. మొదట అవి యూరో కరెన్సీనేమో అని యువకుడు అనుకున్నాడు. నేలను మరింత తవ్వగా మరిన్ని నాణేలు, బంగారు బిస్కెట్లు బయటపడటంతో ఒక్కసారిగా షాకైపోయాడు. ‘ఆ నాణేలు, బిస్కెట్లను చూడగానే ఆశ్చర్యపోయాము. అస్సలు నమ్మశక్యం కాలేదు. అసలు అక్కడ బంగారం దొరుకుతుందని ఎవ్వరమూ ఊహించలేదు’ అని యువకుడు చెప్పాడు. విషయం తెలియగానే పట్టరాని ఆశ్చర్యం వేసిందని ఆ వర్కర్ల సూపర్‌వైజర్ తెలిపారు. ‘33 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నా. కానీ ఇలాంటిది చూడటం ఇదే తొలిసారి’ అని అన్నారు.
విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి బంగారం ఎవరిదో? ఎందురు దాచారో? తెలుసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బంగారం లభించిన భవనం ఓ ఛారిటీ సంస్థదని అధికారులు తెలిపారు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన వారికి ఈ సంస్థ సాయం అందిస్తుంటుంది. భవన ప్రాంగణంలో నాణేలు బయటపడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గుప్త నిధులపై ఆశతో భవనం ప్రాంగణంలోకి చొరబడే ప్రయత్నం చేయొద్దని ప్రజలను హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..
ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు