Share News

ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు

ABN , Publish Date - Aug 16 , 2026 | 04:16 PM

వాగు ఉప్పొంగింది.. దారి మూసుకుపోయింది.. అంబులెన్స్‌‌కు దారిలేదు. దీంతో ఓ గర్భిణికి వైద్యం కోసం డోలీనే దిక్కైంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామస్థులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి.. ఆమెను ఆసుపత్రికి తరలించిన దృశ్యం అందరి మనసులను కలచివేస్తోంది..

ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు
Pregnant Woman Doli

కొమరంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 16: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి మార్గాలు మూసుకుపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోలం గూడకు చెందిన ఏడు నెలల గర్భిణి కొడప రామేశ్వరికి తక్షణ వైద్య సహాయం అవసరం కావడంతో, అంబులెన్స్‌ గ్రామానికి చేరుకోలేని పరిస్థితుల్లో గ్రామస్థులు ఆమెను డోలీలో మోసుకెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటుతూ ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


కెరమెరి ప్రభుత్వ ఆసుపత్రిలో రామేశ్వరిని పరీక్షించిన వైద్యులు.. మెరుగైన వైద్య సేవల కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో రహదారులు మూసుకుపోవడం, అంబులెన్స్‌ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య అత్యవసర పరిస్థితులను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ ఘటన వర్షాకాలంలో గిరిజన ప్రాంతాలకు రవాణా, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

శుభప్రదం... సౌభాగ్యదాయకం... శ్రావణం

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 04:51 PM