Share News

వామ్మో ఈ పక్షి ఏంటీ ఇలా చేసిందీ.. నోరు తెరిచి చూడగా షాకింగ్ సీన్..

ABN , Publish Date - Jun 06 , 2026 | 07:59 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని చిత్ర విచిత్రాలన్నీ మన చేతిల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఒక పక్షి కుందేలు పిల్లలను మింగేయగా.. వాటిని నోటి నుంచి ప్రాణాలతో బయటకు తీసిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వామ్మో ఈ పక్షి ఏంటీ ఇలా చేసిందీ.. నోరు తెరిచి చూడగా షాకింగ్ సీన్..
Rabbit Babies Rescue

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నవ్వులు పూయించేవి విధంగా ఉంటే.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఓ వ్యక్తి పక్షి నోట్లోకి చెయ్యి పెట్టి, లోపల ఉన్న కుందేలు పిల్లలను ఒక్కొక్కటిగా బయటకు తీయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అలా మొత్తం 5 కుందేలు పిల్లలను.. ఆ పక్షి నోటి నుంచి సురక్షితంగా బయటకు తీశాడు. లక్కీగా ఆ పక్షి వాటిని మింగిన కొద్దిసేపటికే గమనించడం వల్ల, అవన్నీ ప్రాణాలతోనే బయటపడ్డాయి.


ఇంతకీ ఆ కుందేలు పిల్లలను మింగేసిన పక్షిని 'పెలికాన్' అని పిలుస్తారు. ఈ పక్షి పొడవైన, పెద్ద ముక్కుతో పాటూ గొంతు కింద ఉండే సంచి లాంటి అమరికను కలిగి ఉంటుంది. ఎలాంటి జీవులనైనా చాలా సులువుగా మింగేయగలదు. సాధారణంగా పెలికాన్ పక్షులు చేపలను ఆహారంగా తీసుకుంటాయి. కానీ ఆకలి వేసినప్పుడు మాత్రం వాటికి దొరికిన జీవులనైనా దాడి చేసి మింగేస్తుంటాయి. ఈ షాకింగ్ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా '@NatureUnedited' అనే ఖాతాలో షేర్ చేశారు.


ఇవి కూడా చదవండి..

2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 09:25 PM