Share News

ఏఐ సాంకేతికతతో నవజాత శిశువుల ఆరోగ్య వివరాల గుర్తింపు: మంత్రి సత్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:52 PM

నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాలను సులభంగా అంచనా వేసేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త ఏఐ (AI) సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ‘శిశు మాపన్’ యాప్‌ను 'ఆశా' యాప్‌తో అనుసంధానించారు. వివరాల్లోకి వెళితే..

ఏఐ సాంకేతికతతో నవజాత శిశువుల ఆరోగ్య వివరాల గుర్తింపు: మంత్రి సత్యకుమార్ యాదవ్
Andhra Pradesh AI App

అమరావతి, జూన్ 06: నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాలను సులభంగా, ఖచ్చితంగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఆధారంగా పనిచేసే ‘శిశు మాపన్’ యాప్‌ను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా పుట్టిన పిల్లలను చేతులతో తాకాల్సిన అవసరం లేకుండానే.. కేవలం మొబైల్ వీడియో ద్వారా వారి ఆరోగ్య వివరాలను రికార్డు చేయవచ్చు.


సాధారణంగా నవజాత శిశువుల బరువు, ఎత్తు, తల, ఛాతీ చుట్టుకొలతలను సాంప్రదాయ పద్ధతుల్లో కొలవడం కొంత శ్రమతో కూడుకున్న పని. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు గాను.. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 'ఆశా' (ASHA) యాప్‌తో ఈ ‘శిశు మాపన్’ యాప్‌ను అనుసంధానించారు. ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం (ANM)లకు ఈ యాప్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేశారు. మంగళగిరిలో సాధించే ఫలితాలు, క్షేత్రస్థాయి అనుభవాలను పరిశీలించిన అనంతరం ఈ అధునాతన ఏఐ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 06:26 PM