ఇలాంటి వారిని ఏమనాలి.. రైలు బోగీకి ట్రంకు పెట్టెను వేలాడదీసి మరీ..
ABN , Publish Date - Jun 05 , 2026 | 06:13 PM
బీహార్‌లో కదిలే రైలు కిటికీ నుంచి ఒక భారీ ఇనుప ట్రంకు పెట్టె ప్రమాదకరంగా వేలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఈ దృశ్యంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో కదిలే రైలు కిటికీ నుంచి ఒక భారీ ఇనుప ట్రంకు పెట్టె బయటకి వేలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇద్దరు ప్రయాణికులు ఆ పెట్టెను లోపలి నుంచి పట్టుకోగా, ఎక్కువ భాగం ప్రమాదకరంగా బయటే ఉంది. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన వీరి చర్యను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వస్తువులను రవాణా చేయడానికి రైల్వే పార్సిల్ సర్వీసులు ఉన్నప్పటికీ, ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులకు ఎలా ఒడిగడతారని కొందరు ప్రశ్నిస్తుండగా, విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంపై మరికొందరు మండిపడుతున్నారు.
ఈ వైరల్ వీడియోపై భారతీయ రైల్వే (రైల్వే సేవా) స్పందించింది. సదరు రైలు నంబర్, స్టేషన్ పేరు, మొబైల్ నంబర్ వివరాలను తెలియజేయాలని, లేదా తక్షణ పరిష్కారం కోసం 'రైల్ మదద్' (RailMadad) యాప్ ద్వారా లేదా 139 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. ఇదిలా ఉంటే.. బీహార్‌కు చెందిన అభిషేక్ కుమార్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఇద్దరు మహిళలు ఒక భారీ ట్రంకు పెట్టెను రైలులోకి ఎక్కించడానికి విఫలయత్నం చేశారు. కానీ.. రైలు బోగీలోకి మాత్రం ఎక్కించలేకపోయారు. అనంతరం ఒక మహిళ తన తలపై మోసుకుంటూ అక్కడి నుంచి వెళ్లింది. చివరికి వారు రైలు అందక స్టేషన్లోనే ఉండిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీ నుంచి పిలుపు!
భీమిలిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల అరెస్ట్