వ్యక్తి ప్రాణాలను తీసిన కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇలాంటి తప్పు ఎవరూ చేయకండి..
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:41 PM
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బైకర్ ప్రాణం పోయింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో రోడ్డు పక్కన కారు ఆపిన వ్యక్తి.. డోర్‌ను అకస్మాత్తుగా తెరవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బైకర్ ప్రాణం పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రోడ్డు పక్కన కారు ఆపిన వ్యక్తి.. డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో, వెనుక నుంచి వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సిసిటివి (CCTV) ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంది. అయితే వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనించకుండా కారులో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా డోర్ తెరిచాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న బైక్.. రెప్పపాటు కాలంలో ఆ డోర్‌ను బలంగా ఢీకొట్టింది. అంతే.. క్షణంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎగిరిపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఒకరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుతని వెంటాడిన పులి.. వీడియో వైరల్
జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్