Share News

మాజీ ప్రేయసి గొంతు కోసిన ప్రేమోన్మాది.. ఆపై గొంతు కోసుకుని..

ABN , Publish Date - Jun 05 , 2026 | 06:03 PM

ఓ ప్రేమోన్మాది మాజీ ప్రేయసిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో పలుమార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. అడ్డుకోబోయిన సహోద్యోగులను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

మాజీ ప్రేయసి గొంతు కోసిన ప్రేమోన్మాది.. ఆపై గొంతు కోసుకుని..

పంజాబ్‌: ఓ ప్రేమోన్మాది మాజీ ప్రేయసిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో పలుమార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. అడ్డుకోబోయిన సహోద్యోగులను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..


మొహాలీలో నిందితుడు హర్జిందర్ సింగ్ మాన్, అతని మాజీ ప్రేయసి డింపుల్ ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పని చేస్తుండేవారు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు వారిద్దరూ సంతోషంగానే ఉన్నారు. ఏం జరిగింతో తెలియదు కానీ ఇటీవల హర్జిందర్ సింగ్‌కి డింపుల్ బ్రేకప్ చెప్పింది. ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేకపోయిన ప్రియుడు.. డింపుల్ ప్రేమను తిరిగి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఆమెను పదేపదే కలిసేందుకు యత్నించాడు. అతని ప్రేమను ఒప్పుకునేందుకు డింపుల్ నిరాకరించడంతో హర్జిందర్ మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.


నిన్న (గురువారం) రాత్రి సమయంలో తాము పని చేస్తున్న ఆఫీసుకి కత్తితో వెళ్లాడు హర్జిందర్ సింగ్. కుర్చీలో కూర్చొన్న డింపుల్‌పై వెనుక నుంచి ఒక్కసారిగా దాడి చేయడం ప్రారంభించాడు. దీంతో యువతి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీసింది. అయినా వెంట పడి మరీ పలుమార్లు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఇది గమనించిన తోటి ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అతన్ని ఆపేందుకు కొంత మంది యువకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వారిపైనా కత్తి దూసేందుకు యత్నించాడు హర్జిందర్. అప్పటికే కుప్పకూలిపోయిన డింపుల్ మెడ, ముఖం, కడుపు భాగాల్లో మళ్లీ పలుమార్లు పొడిచాడు.


ఈ దాడిని ఆపేందుకు మరో యువకుడు కత్తితో రావడంతో నిందితుడు వెనక్కి తగ్గాడు. అనంతరం కత్తితో తన గొంతులో తానే పలుమార్లు పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది చూసి అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురి కాగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డింపుల్, హర్జిందర్‌లను చికిత్స కోసం ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డింపుల్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించగా.. హర్జిందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్

రైలు దిగి మామిడికాయలు కోశాడు.. బోగీలోకి వెళ్లే లోపు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Updated Date - Jun 05 , 2026 | 06:42 PM