రైలు బోగీలో ఇలాంటి పని మీరెప్పుడు చూసుండరు.. వైరల్ వీడియో..
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:18 AM
సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వింతవింత వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తుంటాయి. కొన్ని వీడియోలు విమర్శలు ఎదుర్కొంటే, మరికొన్ని వీడియోలు ప్రశంసలు అందుకుంటుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వింతవింత వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తుంటాయి. కొన్ని వీడియోలు విమర్శలు ఎదుర్కొంటే, మరికొన్ని వీడియోలు ప్రశంసలు అందుకుంటుంటాయి. తాజాగా ఓ రైలుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రైలు బోగీలో ఒకే చోటకు ప్రయాణికులు చేరి చేసిన పని చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రైల్వే శాఖ 'భారత్ గౌరవ్' రైలును నడుపుతోంది. ఈ రైలు తరచుగా దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులను తీర్థయాత్రలకు తీసుకెళ్తుంటుంది. అయితే, తాజాగా ఈ రైలుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఓ బోగిలోని స్లీపర్ బెర్త్‌ను చిన్నపాటి ఆలయంగా మార్చేశారు భక్తులు. దేవుళ్ల చిత్రపటాలు, పూలమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం బోగిలోని ప్రయాణికులంతా పెద్దఎత్తున అక్కడికి చేరుకుని పూజా కార్యక్రమాలు మెుదలుపెట్టారు. పాటలు పాడుతూ హారతులు ఇస్తూ భజనలు చేశారు.
ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ లోతైన ఆధ్యాత్మిక సంప్రదాయాలను ఈ వీడియో ప్రతిబింబిస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. భారతదేశం సంస్కృతి, విశ్వాసాల గడ్డ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇరుకైన కోచ్‌లో గుంపులుగా చేరడం ప్రమాదకరని.. హారతి ఇవ్వడం వంటివి భద్రతా సమస్యలకు కారణం కావొచ్చని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇలా భిన్నాభిప్రాయాల నడుమ వీడియో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
వరుడికి షాకిచ్చిన వధువు.. మేకప్ కిట్ తెచ్చివ్వలేదని..
పక్షుల గుంపులు 'వి' ఆకారంలోనే ఎందుకు.. దీని వెనుక కారణమేంటి?