రైలు దిగి మామిడికాయలు కోశాడు.. బోగీలోకి వెళ్లే లోపు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:43 PM
రైలు ఆగడమే ఆలస్యం.. తోటలోకి దూరి మామిడి పండ్లను దొంగిలించడానికి ప్రయత్నించిన ఒక ప్రయాణికుడికి కోలుకోలేని షాక్ తగిలింది..
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రోజుకో విచిత్రమైన వీడియో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. అత్యాశకు పోయి దొంగతనానికి ప్రయత్నిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక రైలు ట్రాక్‌పై ఆగింది. రైలు ఆగడమే ఆలస్యం.. అందులోని ఒక ప్రయాణికుడు కిందకు దిగాడు. రైలు పక్కనే ఉన్న మామిడి తోట ఉండడంతో కాయలు చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని భావించి చటుక్కున తోటలోకి దూరి, చెట్టు నుంచి మామిడి పండ్లను కోసుకున్నాడు. తిరిగి రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
అప్పటికే ఇదంగా గమనిస్తున్న తోట యజమాని.. చేతిలో పెద్ద కర్ర పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చీ రావడంతోనే రైలు ఎక్కుతున్న ప్రయాణికుడిపై దెబ్బల వర్షం కురిపించాడు. తప్పించుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఆ ప్రయాణికుడు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 'రితేష్ కుష్వాహా' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్రీగా మామిడి పండ్లు తినాలనుకున్న వాడికి గట్టి ప్రసాదమే దొరికింది.. అంటూ కొందరు, ఈ దెబ్బలకు ఇక జీవితంలో మామిడి పండ్ల వైపు చూడడు.. అంటూ మరికొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై..
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆన్‌లైన్ క్యాంపెయిన్