నాగుపామును డ్రమ్‌లో వేసిన తాత.. తర్వాత ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:06 PM
విషపూరితమైన నాగుపామును పట్టుకోవడానికి వెళ్లిన ఓ వృద్ధుడికి ఊహించని అనుభవం ఎదురైంది. పామును డ్రమ్‌లో బంధించే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇంటి వరండాలో రాత్రి సమయంలో పొడవాటి నాగుపాము పడగ విప్పి కనిపించింది. దీంతో ఆ పామును పట్టుకునేందుకు అక్కడున్న ఓ వృద్ధుడు ప్రయత్నించాడు. ఇందుకోసం ప్లాస్టిక్ డ్రమ్, ఓ పొడవాటి కర్రను తీసుకొచ్చాడు.
పామును డ్రమ్‌లోకి పంపించేందుకు ప్రయత్నిస్తూ కర్రతో దాన్ని కదిలించాడు. పామును డ్రమ్‌లో వేసిన మరుక్షణం బ్యాలెన్స్ కోల్పోయి డ్రమ్‌తో సహా వెనక్కి పడిపోయాడు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా భయంతో పక్కకు వెళ్లిపోతారు. కానీ ఈ తాత మాత్రం డ్రమ్‌ను మాత్రం వదలలేదు. నేలపై పడుకున్నట్లుగానే డ్రమ్‌ను చేతులు.. కాళ్లతో పైకి ఎత్తుతూ వింత విన్యాసాలు చేశాడు. అతని చేష్టలు చూస్తుంటే జిమ్‌లో వ్యాయామం చేస్తున్నట్లుగా అనిపించింది. కొన్ని క్షణాల పాటు డ్రమ్‌తో విన్యాసాలు చేసిన వృద్ధుడు ఆ తర్వాత తిరిగి లేచి తన ప్రయత్నాన్ని కొనసాగించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో ‘amar2431singh’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘తాత పామును పట్టుకుంటున్నాడా? జిమ్ చేస్తున్నాడా?’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘పామును డ్రమ్‌లో వేశానని ఆనందంలో అదిరిపోయే డ్యాన్స్’ అని ఒక నెటిజన్, ‘ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో సహనం కోల్పోలేదు తాత, నువు గ్రాట్’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం