Share News

ముంబై వర్షాల్లో ట్రాక్‌పై ఉన్న కుక్కను రక్షించిన లోకో పైలట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 05 , 2026 | 01:43 PM

ముంబై వర్షాల్లో ట్రాక్‌పై చిక్కుకున్న కుక్కను రక్షించి అందరితో శభాష్ అనిపించుకున్నాడో లోకో పైలట్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ముంబై వర్షాల్లో ట్రాక్‌పై ఉన్న కుక్కను రక్షించిన లోకో పైలట్.. వీడియో వైరల్
Mumbai Local Train

ఇంటర్నెట్ డెస్క్: ముంబై వర్షాల్లో ట్రాక్‌పై చిక్కుకున్న కుక్కను రక్షించి అందరిచే శభాష్ అనిపించుకున్నాడో లోకో పైలట్. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాల నేపథ్యంలో కుర్లా రైల్వే స్టేషన్‌లో మానవత్వాన్ని చాటే ఒక అద్భుతమైన సంఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలపై చిక్కుకుపోయిన ఒక మూగజీవాన్ని కాపాడటానికి లోకో పైలట్ సమయస్ఫూర్తితో రైలును నిలిపివేయగా, ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి దాన్ని పక్కకు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించిన తరుణంలో లోకల్ రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో కుర్లా స్టేషన్ ప్లాట్‌ఫాం వైపు ఒక లోకల్ రైలు వస్తుండగా, ఒక వీధి కుక్క ప్రమాదవశాత్తు రైలు పట్టాలపైకి వచ్చి భయంతో అక్కడే ఉండిపోయింది. రైలు వస్తున్నా అది కదలకపోవడంతో గమనించిన లోకో పైలట్.. దాన్ని పక్కకు పంపేందుకు పదేపదే హారన్ కొడుతూ రైలు వేగాన్ని తగ్గించాడు. అయినప్పటికీ ఆ కుక్క అక్కడి నుంచి కదల్లేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి వెంటనే పట్టాలపైకి దిగి, ఆ కుక్కను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాడు. మొదట ఆ కుక్క భయంతో అతడిపైకి తిరగబడటానికి ప్రయత్నించినప్పటికీ, సమయస్ఫూర్తితో ఆ వ్యక్తి, లోకో పైలట్ కలిసి ఆ మూగజీవాన్ని కాపాడగలిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

షారుక్‌ నా ఫస్ట్‌ క్రష్‌

బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 02:00 PM