Share News

లోకల్ ట్రైన్‌లో సీటు కోసం మహిళ కొత్త ఐడియా! వీడియో వైరల్

ABN , Publish Date - Mar 09 , 2026 | 08:25 AM

ముంబై నగరానికి లోకల్ ట్రైన్లు జీవనాడి వంటివి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే ఈ రేళ్లలో కనీసం నిలబడటానికి కూడా చోటు దొరకదు. అలాంటిది ముంబై సబర్బన్ రైల్వేలో రద్దీగా ఉండే విరార్ వెళ్లే రైలులో ఒక మహిళ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే..

లోకల్ ట్రైన్‌లో సీటు కోసం మహిళ కొత్త ఐడియా! వీడియో వైరల్
Mumbai Local Train Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ముంబై నగరానికి లోకల్ ట్రైన్లు జీవనాడి వంటివి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే ఈ రైళ్లలో కనీసం నిలబడటానికి కూడా చోటు దొరకదు. అలాంటిది ముంబై సబర్బన్ రైల్వేలో రద్దీగా ఉండే విరార్ వెళ్లే రైలులో ఒక మహిళ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీటు దొరకలేదని బాధపడకుండా, తన ఇంటి నుంచి ఒక ఫోల్డింగ్ ప్లాస్టీక్ కుర్చిని తెచ్చుకొని రైలులో కూర్చుని ప్రయాణించింది. లోకల్ రైలులో ఎప్పుడూ కుర్చీ దొరక్క బాధపడే వారు ఆమె తెలివిని చూసి మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వీడియోలో.. ముంబై సబర్బన్ రైల్వేలో రద్దీగా ఉండే విరార్ వెళ్లే రైలులో ఒక మహిళ తన బ్యాగ్ నుంచి ఒక ఫోల్డింగ్ చైర్ తీసింది. ఆ చైర్‌ను రైలు కంపార్ట్ మెంట్‌లోని ఖాళీ స్థలంలో వేసుకొని దర్జాగా కూర్చుంది. పక్కన ఉన్న ప్రయాణికులు ఆమె తెలివి చూసి అవాక్కయ్యారు. అప్పుడు ఆ మహిళ చిరు నవ్వుతో ‘విరార్ లోకల్ ట్రైన్‌లో కూర్చోవాలంటే, ఐడియా ఉండాలి. సీటు కోసం వెతకొద్దు.. మనమే సెట్ చేసుకోవాలి’ అంటూ జోక్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘ముంబై రైళ్లలో సీటు దొరకాలంటే గంటల తరబడి వేచి ఉండాలి, ఈ కుర్చీ ఉపాయం భలే ఉంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ముంబైలో బతకాలంటే ఇలాంటి వినూత్న ఆలోచనలు ఉండాల్సిందే’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..

రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2026 | 10:05 AM