Share News

ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. రైలు ఎక్కుతుండగా..

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:04 PM

ముంబైలోని కర్జత్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న సీఎస్‌ఎంటీ-పుణె ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు అదుపుతప్పి పట్టాలపై పడిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. రైలు ఎక్కుతుండగా..
Mumbai Karjat Railway Station

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని కర్జత్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న సీఎస్‌ఎంటీ-పుణె ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు అదుపుతప్పి పట్టాలపై పడిపోయాడు. కర్జత్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ నంబర్‌ 1పై ఈ ఘటన చోటుచేసుకుంది. 12123 నంబర్‌ సీఎస్‌ఎంటీ-పుణె ఎక్స్‌ప్రెస్‌ కదులుతున్న సమయంలో సి-1 కోచ్‌లోకి ఎక్కేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఒక్కసారిగా పట్టు తప్పి పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో రైల్వే సిబ్బంది సౌరభ్ కుమార్ సింగ్ ఈ ప్రమాదాన్ని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైన్ మేనేజర్‌కు రెడ్ సిగ్నల్ చూపించడంతో రైలును వెంటనే నిలిపివేశారు.


సిబ్బంది చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం..

రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బంది.. అక్కడున్న ఇతరులు పట్టాలపైకి వెళ్లి ప్రయాణికుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ అతడికి పెద్దగా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. పాయింట్స్‌మ్యాన్ సౌరభ్ కుమార్ సింగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికుడి ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read:

ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు..

రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే..

Updated Date - Aug 13 , 2026 | 01:33 PM