Share News

కారు బానెట్‌‌లో భారీ కొండచిలువ కలకలం..

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:49 AM

కారు ఇంజిన్‌ భాగంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించి బానెట్‌ తెరిచారు. తీరా చూస్తే అందులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ముంబైలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది..

కారు బానెట్‌‌లో భారీ కొండచిలువ కలకలం..
Giant Python in Car Bonnet

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని దహిసర్ వెస్ట్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. కందర్పడలోని బాపు బాగ్వే రోడ్డులో మహేశ్వర్ బిల్డింగ్ సమీపంలోని పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఓ కారు బానెట్‌లో భారీ కొండచిలువ కనిపించింది. బానెట్ తెరిచి చూడగా ఇంజిన్ భాగంలో కొండచిలువ ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాముల రక్షణ బృందానికి సమాచారం అందించడంతో.. వారు అక్కడికి చేరుకుని కొండచిలువను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఇంజిన్ భాగాన్ని గట్టిగా చుట్టుకుని ఉండటంతో దాన్ని బయటకు తీయడం కొంత కష్టంగా మారింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా కొండచిలువను సురక్షితంగా బయటకు తీశారు.


కొండచిలువను బయటకు తీసిన రెస్క్యూ బృందం,, దానికి వైద్య పరీక్షలు నిర్వహించి, సంజయ్ గాంధీ జాతీయ పార్కులో విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా, కారు బోనెట్‌లో ఇంత పెద్ద కొండచిలువ కనిపించడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో భారీ కొండచిలువ కారు ఇంజిన్ మధ్యలో ఇరుక్కుని ఉండటం, రెస్క్యూ సిబ్బంది దాన్ని బయటకు లాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బయటకు తీసే క్రమంలో కొండచిలువ రక్షణ సిబ్బందిని పట్టుకోవడంతో అక్కడ కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే సిబ్బంది దాన్ని జాగ్రత్తగా సంచిలోకి తీసుకుని తరలించారు.


ఇవి కూడా చదవండి

ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి

ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు

Updated Date - Sep 08 , 2026 | 11:58 AM