స్కూటీ డిక్కీలో పసిబిడ్డ.. తల్లి నిర్వాకంపై నెటిజన్ల ఆగ్రహం!
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:17 PM
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక మహిళ తన స్కూటీ(Scooty) సీటు కింద ఉండే స్టోరేజ్ బాక్స్ (డిక్కీ)(Storage box) లో ఒక బాబును ఉంచి, సీటు మూసేసి బండి నడుపుకుంటూ వెళ్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళ ఇంటి నుంచి చిన్నారితో బయటకు వచ్చింది. అక్కడే ఉన్న స్కూటీ సీటు ఓపెన్ చేసింది. అందులో ఒక చిన్న బొమ్మ ఉంది.. ఆ బొమ్మపై చిన్నారిని పడుకోబెట్టింది. సీటును మూసేసి స్కూటీపై బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
స్కూటీ డిక్కీలు హెల్మెట్‌లు, చిన్న బ్యాగులు, పత్రాలు లేదా వ్యక్తిగత వస్తువులు స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవి. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూసి మరి కొంతమంది నేర్చుకునే ప్రమాదం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ఏం తల్లి.. ఇంత దారుణమా?’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఇది కేవలం స్క్రిప్ట్ మాత్రమేనని ఆశిస్తున్నాను’ అని ఇంకో నెటిజన్, ‘ఆ తల్లికి జ్ఞానం లేదు.. చిన్నారిపై శ్రద్ధ లేదు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..