మెట్రోలో సీటు దొరకలేదా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:47 PM
బస్సు, రైలు, మెట్రో రైలు.. ఇలా ఎందులో ప్రయాణించినా ఒక్క సీటు దొరికితే చిన్నపాటి కునుకు తీసేయవచ్చు. లేకుంటే సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయవచ్చు. అలా చేస్తే.. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రయాణం చేసిన అలసట ఎంత మాత్రం ఉండదు.
ఇంటర్నెట్ డెస్క్: బస్సు, రైలు, మెట్రో రైలు.. ఇలా ఎందులో ప్రయాణించినా ఒక్క సీటు దొరికితే చిన్నపాటి కునుకు తీసేయవచ్చు. లేకుంటే సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయవచ్చు. అలా చేస్తే.. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రయాణం చేసిన అలసట ఎంత మాత్రం ఉండదు. కానీ బస్సు, రైలు, మెట్రో రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. మహిళలు, వృద్ధులకు సీట్లు కేటాయించడంతో.. ప్రయాణికులు నిలబడి ప్రయాణించాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో మెట్రో రైలులో ఓ వృద్ధుడు చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఓ వృద్ధుడు మెట్రో రైలు ఎక్కాడు. రైలు తలుపులు మూసుకున్నాయి. అనంతరం కింద పెట్టిన తన బ్యాగ్ జిప్పు తీసి.. అందులో నుంచి ఫోల్డబుల్ ప్లాస్టిక్ స్టూల్ బయటకు తీశాడు. గేటు పక్కనే దానిని వేసుకుని కూర్చోన్నాడు. అనంతరం బ్యాగ్ జిప్పు వేశాడు. ఆ ప్లాస్టిక్ స్టూల్‌పై క్చూర్చోని హాయిగా తన సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు.
ఈ వీడియోను mini_vlog_metro అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీ సంతోషం, సౌకర్యం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మెట్రో సిబ్బంది బ్యాగ్ తనిఖీ సమయంలో మడత కుర్చీలను నిషేధించాల్సి వస్తుందేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆ వృద్ధుడి ఆలోచనకు పలువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆయన ఐడియా బాగుందని ప్రశంసిస్తున్నారు.