Viral News: మేనేజర్ ఓవరాక్షన్.. ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్..
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:16 AM
రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే.. గౌరవం కాదు కదా.. కనీసం విలువ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే వెలుగులోకి వచ్చింది. సెలవు కోరితే.. చులకనగా మాట్లాడిన మేనేజర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది ఓ ఉద్యోగిని. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
సదరు పోస్టులో ఏ ప్రాంతంలో జరిగింది అనే వివరాలు పేర్కొనలేదు గానీ.. ఓ ప్రైవేటు బ్యాంకులో చాలా సంవత్సరాల నుంచి ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆమె తల్లి అనారోగ్యానికి గురవడంతో.. ఆమెకు సహాయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తనకు కొద్ది రోజులు సెలవు కావాలని.. తన తల్లికి అనారోగ్యం కారణంగా సహాయంగా ఉండాలని మేనేజర్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, దీనికి స్పందించిన మేనేజర్ అమార్యదకరంగా మాట్లాడాడు. ‘ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌లో గానీ, షెల్టర్ హోమ్‌లో గానీ ఉంచి ఆఫీసుకు వచ్చేయండి. సెలవులు ఇవ్వడం కుదరదు.’ అని సమాధానం ఇచ్చాడు. మేనేజర్ మాట్లాడిన విధానంతో మనస్తాపానికి గురైన సదరు ఉద్యోగిని.. ఉద్యోగం కంటే తనకు తన తల్లే ముఖ్యం అని భావించింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ఈ విషయాన్ని Mr_Moulick అనే రెడిట్ యూజర్ r/IndianWorkplace సబ్‌రెడిట్‌లో పోస్ట్ చేశారు. రిజైన్ చేసిన ఉద్యోగిని కొన్ని సంవత్సరాలపాటు బ్యాంకులో పని చేశారని.. అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరైనదేనా? పని ప్రదేశాలలో ఇలాంటి వాతావరణం, మాటలు సమర్థనీయమేనా అంటూ తన పోస్టులో ప్రశ్నించారామె.

Also Read:
గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు
జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..
యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఈ మందు బాబు వీడియో చూడండి..