వామ్మో.. డస్ట్‌బిన్‌ను ఇలాక్కూడా వాడతారా? వీడియో వైరల్
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:25 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన వినూత్నమైన ప్రయోగానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన వినూత్నమైన ప్రయోగానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎండకాలం వచ్చిందంటే ఉక్కపోత తట్టుకోలేక మార్కెట్లో దొరికే రకరకాల కంపెనీలకు చెందిన కూలర్లు, ఏసీలను కొనుగోలు చేయడం సర్వసాధారణం. కానీ, ఓ వ్యక్తి డస్ట్‌బిన్‌తో.. ఏకంగా కూలర్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనిస్తే.. ఒక వ్యక్తి పెద్ద ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌ను తీసుకుని, దాన్ని నాలుగు వైపులా కట్ చేశాడు. మూడు వైపులా కూలర్ కు వాడే గడ్డిని, దానికి సపోర్టుగా ఒక మెష్ వలను అమర్చి పక్కాగా డిజైన్ చేశాడు. ఫైనల్‌గా అది అచ్చం కూలర్‌లా మారిపోయింది.
ఈ వీడియో @RealTofanOjha అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఓ మై గాడ్.. డస్ట్‌బిన్‌ని ఇలా కూడా వాడుతున్నారా? నేను చూడటం ఇదే ఫస్ట్ టైమ్’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఇలాంటి అద్భుతమైన ఐడియాలు మన ఇండియన్స్‌కే వస్తాయ్’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘చెత్త బుట్ట అని తీసేయకండి.. అది చల్ల చల్లని గాలినిస్తుంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి: మంత్రి నారా లోకేష్
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
For More TG News And Telugu News