మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:14 PM
మహారాష్ట్రలో జరిగిన ఓ విచిత్రమైన దొంగతనం ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన మామ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఓ 19 ఏళ్ల యువకుడు.. వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో కొత్త మహీంద్రా థార్ కారు కొనుగోలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో జరిగిన ఓ విచిత్రమైన దొంగతనం ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన మామ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఓ 19 ఏళ్ల యువకుడు.. వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో కొత్త మహీంద్రా థార్ కారు కొనుగోలు చేశాడు. అంతటితో ఆగకుండా, తాను కొనుగోలు చేసిన కొత్త కారుకు పూజ నిర్వహిస్తూ.. బంగారం పోగొట్టుకున్న మామను ఆ కార్యక్రమానికి ఆహ్వానించాడు. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు (Maharashtra gold theft).
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పన్హాలాకు చెందిన సమర్ చవాన్ అనే యువకుడు అదే ప్రాంతంలో తన నివసించే మామ ఉమేశ్ ఇంట్లో నుంచి సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఆ నగలను స్థానిక ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ బాబాసో మోరేకు రూ.10 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బుతో సమర్ కొత్త మహీంద్రా థార్ కారును కొనుగోలు చేశాడు. కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత సమర్ దానికి పూజ నిర్వహించాలనుకున్నాడు. ఈ కార్యక్రమానికి తన మామ ఉమేశ్‌ను కూడా ఆహ్వానించాడు. అయితే, పూజకు సిద్ధమవుతున్న సమయంలో ఉమేశ్ తన బంగారు ఆభరణాల కోసం వెతకగా అవి కనిపించలేదు (Man steals uncle gold).
తనకు, తన భార్యకు చెందిన నగలు మాయమయ్యాయని ఉమేశ్ గుర్తించాడు (Maharashtra gold theft). ఇంటి వ్యవహారాలు తెలిసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని భావించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే థార్ కొనుగోలు చేసేందుకు సమర్కు అంత డబ్బు ఎలా సమకూరిందనే అనుమానం కూడా కలిగింది. ఇదే విషయం పోలీసులకు ఉమేశ్ చెప్పాడు. దీంతో పోలీసులు సమర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సమర్‌తో పాటు నగలు కోనుగోలు చేసిన వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్సెట్ ధర 2 లక్షలు