Share News

బిల్‌బోర్డ్ హోర్డింగ్‌పైకి ఎక్కిన యువకుడు.. తప్పిన పెను ప్రమాదం! వీడియో వైరల్

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:49 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల ఫన్నీ, ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది చేసే చిత్ర విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలకు ఇంటర్నెట్‌లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

బిల్‌బోర్డ్ హోర్డింగ్‌పైకి ఎక్కిన యువకుడు.. తప్పిన పెను ప్రమాదం! వీడియో వైరల్
Guwahati Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల ఫన్నీ, ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది చేసే చిత్ర విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలకు ఇంటర్నెట్‌లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. తాజాగా.. అస్సాంలోని గువాహటి నగరంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన భారీ బిల్‌బోర్డ్ స్ట్రక్చర్‌పై ఒక వ్యక్తి ఎక్కి నానా హంగామా చేశాడు. ఆ వ్యక్తి ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అక్కడి వారందరినీ షాక్‌కు గురిచేసింది.


అప్రమత్తమైన స్థానిక పోలీస్.. ఆ వ్యక్తిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ వ్యక్తి పోలీస్ మాట వినిపించుకోకుండా పైకెక్కే ప్రయత్నం చేశాడు. దీంతో కర్రతో కొట్టి అతణ్ని కిందకు దిగమని కోరారా పోలీస్ సిబ్బంది. ఈ తతంగమంతా వాహనదారులు వీడియోలు, ఫొటోలు తీశారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ వ్యక్తి ఎటువంటి భయం లేకుండా హోర్డింగ్‌కు ఏర్పాటుచేసిన ఇనుపరాడ్లను పట్టుకుని ఎక్కుతున్న దృశ్యాలు భయాందోళనకు గురిచేశాయి. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఇలా చేశాడా? లేదా మద్యం సేవించి అలా ప్రవర్తించాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ద్వారా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘అతను పోలీసుతో ఆడుకుంటున్నాడు’ అని, ‘మీరు అక్కడ ఏమి చేస్తున్నారు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


ఇవి కూడా చదవండి..

నాటాంజ్ అణుక్షేత్రంపై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ రాయబారి సంచలన ప్రకటన

సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్

Updated Date - Mar 04 , 2026 | 02:35 PM