బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు.. సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీమ్..
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:24 PM
పది అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారి కోసం రెండు గంటల పాటు ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ సాగింది. చివరకు చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: పది అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారి కోసం రెండు గంటల పాటు ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ సాగింది. చివరకు ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలోని పరభణి జిల్లా జింతూర్ తాలూకా కౌసడీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పది అడుగుల లోతున్న బోరుబావిలో బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. చిన్నారి బోరుబావిలో చిక్కుకుపోయిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సబ్ డివిజనల్ అధికారి సహా పరిపాలనా అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బోరుబావి లోపల చిక్కుకుపోయిన చిన్నారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగకుండా అధికారులు ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఉత్కంఠ..
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ అనంతరం మూడేళ్ల చిన్నారి అద్నాన్ షేక్ నదీమ్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాలుడికి వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్స అందించేందుకు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారుల ప్రయత్నాలతో చిన్నారి ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. బోర్‌వెల్ నుంచి బాలుడిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ..
Read Latest AP News And Telangana News And International News And Telugu News