లాస్ ఏంజిల్స్‌లో పోలీసుపై పిట్ బుల్ దాడి.. మహిళ అరెస్ట్.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:00 PM
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో పోలీసుల అరెస్టు ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ మహిళను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న LAPD అధికారిపై ఆమె వెంట ఉన్న పిట్ బుల్ కుక్క దాడి చేసి కరిచింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్కిడ్ రో ప్రాంతం సమీపంలోని 6వ, వాల్ వీధుల కూడలి వద్ద ఓ మహిళను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న LAPD పోలీస్ అధికారిపై పిట్ బుల్ కుక్క దాడి చేసి కరిచింది. మహిళ అరెస్టును ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కుక్కను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, మహిళ, పోలీసు అధికారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు మహిళ కుక్కతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అధికారి వెంబడించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పిట్ బుల్‌ను అక్కడ నుంచి తీసుకువెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహిళ అరెస్ట్.. జంతు సంరక్షణ శాఖకు కుక్కజజ
ఈ ఘటనలో గాయపడిన పోలీసు అధికారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD) వెల్లడించింది. మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ధృవీకరించింది. అనంతరం పిట్ బుల్ కుక్కను గుర్తించి లాస్ ఏంజిల్స్ యానిమల్ సర్వీసెస్ అధికారులకు అప్పగించారు. అయితే.. మహిళను ఏ కారణంతో అరెస్టు చేశారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. యూట్యూబర్ రోమ్300లా చిత్రీకరించిన ఈ వీడియోలో పోలీసు అధికారి, మహిళ, అక్కడున్న మరో వ్యక్తి మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News