Share News

Nokia Phones Viral Video: 2010లో నోకియా ఫోన్లు ఆర్డర్ పెడితే 2026లో డెలివరీ..

ABN , Publish Date - Jan 11 , 2026 | 10:49 AM

ఓ ఫోన్ షోరూం యజమాని 2010లో పెద్ద మొత్తంలో నోకియా మొబైల్ ఫోన్‌లు ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీ ఆలస్యమైంది. అది మామూలు ఆలస్యం కాదు. ఫోన్లు డెలివరీ అవ్వటానికి ఏకంగా 16 సంవత్సరాలు పట్టింది..

Nokia Phones Viral Video: 2010లో నోకియా ఫోన్లు ఆర్డర్ పెడితే 2026లో డెలివరీ..
Nokia Phones Viral Video

15 ఏళ్ల క్రితం నోకియా ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఏ కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చినా.. ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. కోటీశ్వరుల దగ్గరి నుంచి సాధారణ మధ్య తరగతి వరకు అన్ని వర్గాల్లో నోకియాకు మంచి డిమాండ్ ఉండేది. 2007 నుంచి మెల్ల మెల్లగా నోకియా కంపెనీ పతనం మొదలైంది. యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం పెరిగిపోయిన తర్వాత నోకియా ఫోన్లకు డిమాండ్ తగ్గిపోయింది. సింబియాన్ ఓఎస్ నుంచి అప్‌డేట్ కాకపోవటం వల్ల నోకియా కంపెనీ పూర్తి స్థాయిలో పతనం అయిపోయింది. భారీ షేర్ లాస్ కారణంగా నొకియా కంపెనీ 2013లో ఫోన్ బిజినెస్‌‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి అమ్మేసింది.


2010లో పలు దేశాల్లో నోకియా ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. లిబియాకు చెందిన ఓ ఫోన్ షోరూం యజమాని 2010లో పెద్ద మొత్తంలో నోకియా మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీ ఆలస్యమైంది. అది మామూలు ఆలస్యం కాదు. ఫోన్లు డెలివరీ అవ్వటానికి ఏకంగా 16 సంవత్సరాలు పట్టింది. 2010లో ఆర్డర్ చేస్తే.. 2026లో డెలివరీ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ట్రిపోలికి చెందిన మొబైల్ ఫోన్ షోరూం యజమాని 2010లో ఫోన్లను ఆర్డర్ పెట్టాడు. ఆ వెంటనే లిబియాలో సివిల్ వార్ మొదలైంది. దీంతో దేశం మొత్తం అతలాకుతలం అయింది. ఈ కారణంగా షిప్‌మెంట్ ఆగిపోయింది.


మొబైల్ ఫోన్లు వేర్ హౌస్‌లోనే ఉండిపోయాయి. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇలాంటి సమయంలో.. ఆ డెలివరీ కంపెనీ కూడా 16 ఏళ్ల తర్వాత డెలివరీ ప్రాసెస్ మళ్లీ మొదలైంది. రెండు రోజుల క్రితం షోరూం యజమానికి ఫోన్లు డెలివరీ అయ్యాయి. ఆ ఫోన్లను చూసి అతడు షాక్ అయ్యాడు. తన పరిస్థితి తల్చుకుని బాగా నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఫోన్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో 2010 నాటి టాప్ ఎండ్ నోకియా ఫోన్ మోడల్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం ప్లిప్ ఫోన్లు కావటం విశేషం. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నోకియా ఫోన్లతో ఉన్న చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి..

జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

Updated Date - Jan 11 , 2026 | 11:20 AM