చిరుత స్కెచ్‌ను భగ్నం చేసిన పక్షి.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:53 AM
అడవిలో వేటగాడు ఎంత తెలివిగా మాటు వేసినా.. కొన్నిసార్లు ప్రకృతి ఇచ్చే చిన్న సంకేతం మొత్తం ఆటను మార్చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని సాబి సాండ్ గేమ్ రిజర్వ్‌లో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది..
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలోని సాబి సాండ్ గేమ్ రిజర్వ్‌లో ఆసక్తికర ఘటన కెమెరాకు చిక్కింది. ఓ చిరుత జింకల మందను లక్ష్యంగా చేసుకుని దాదాపు ఐదు నిమిషాల పాటు నిశ్శబ్దంగా మాటు వేసింది. జింకలకు అనుమానం రాకుండా ఎంతో ఓపికగా సరైన సమయం కోసం ఎదురుచూసింది. చూస్తున్న వీక్షకులకు చిరుత ఏ క్షణంలోనైనా దాడి చేస్తుందని అనిపిస్తుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
చిరుత కదలికలను గమనించినట్టుగా కొన్ని పక్షులు ఒక్కసారిగా గట్టిగా కూత వేశాయి. ఆ శబ్దాలతో అప్రమత్తమైన జింకల మంద వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి పరుగులు తీశాయి. దీంతో ఎంతో ఓపికగా ఎదురుచూసిన చిరుతకు.. వేట కళ్లముందే చేజారిపోయింది. పక్షుల హెచ్చరికతో జింకల మంద ప్రాణాలను కాపాడుకున్న ఈ ఆసక్తికర దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘పిట్ట కూత ఎంత పనిచేసింది’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘జింకల ప్రాణాలు కాపాడిన పక్షులు.. చిరుత కడుపు కొట్టాయిగా?’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..
భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..