Share News

అదృష్టం అంటే ఈమెదే.. రూ. 13 వేలతో షాపింగ్ చేసి ఖరీదైన ఇల్లు గెలుచుకుంది..

ABN , Publish Date - Jun 24 , 2026 | 02:18 PM

అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది.

అదృష్టం అంటే ఈమెదే.. రూ. 13 వేలతో షాపింగ్ చేసి ఖరీదైన ఇల్లు గెలుచుకుంది..
Dubai apartment winner

అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది. దుబాయ్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక షాపింగ్ డ్రాలో పాల్గొన్న ఆమెకు పూర్తి ఉచితంగా ఒక స్టూడియో అపార్ట్‌మెంట్ లభించింది. కోట్ల రూపాయాల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఉచితంగా లభించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి (Dubai apartment winner).


కేరళకు చెందిన అయేషా అమీర్ దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఆమెకు గతేడాది వివాహం జరిగింది. ఇటీవల, ఆమె దుబాయ్‌లోని ఒక షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడ, ఆమె 'విన్ యువర్ హోమ్ ఇన్ దుబాయ్' అనే కాంటెస్ట్‌కు సంబంధించిన పోస్టర్లను చూశారు. 500 దిర్హామ్‌ల (దాదాపు రూ.13 వేలు) విలువైన షాపింగ్ చేసి ఆ డ్రాలో పాల్గొన్నారు. ఆ కాంటెస్ట్ గురించి మర్చిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత, ఆమెకు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అపార్ట్‌మెంట్ గెలుచుకున్నట్టు నిర్వాహకులు చెప్పారు. (Dubai lucky draw).


ఎవరో తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావించి, ఆమె ఆ కాల్‌ను పెద్దగా పట్టించుకోలేదు (Indian woman wins home). అయితే, ఆ తర్వాత నిర్వాహకులు పూర్తి వివరాలతో ఆమెకు ఒక ఈ-మెయిల్ పంపారు. దీంతో తాను నిజంగానే ఒక ఇల్లు గెలుచుకున్నానని ఆమె నమ్మారు. ఆమె, ఆమె భర్త ఒక ఇల్లు కొనాలని కొంతకాలంగా ఆలోచిస్తున్నారు. అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా వారు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. ఇలాంటి సమయంలో ఉచితంగా అపార్ట్‌మెంట్ రావడం తమకు ఊహించని వరమని అయేషా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు


భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 24 , 2026 | 02:26 PM