ఇండిగో విమానంలో ఫ్యామిలీ విందు.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:22 PM
సాధారణంగా విమానంలో ఫుడ్ అంటే స్నాక్ లేదా మీల్ అందుబాటులో ఉంటాయి. కానీ.. ఓ కుటుంబం మాత్రం విమానాన్ని ఏకంగా క్యాంటిన్‌గా మార్చేసింది. విమానంలో ప్లేట్లు పెట్టుకుని భోజనం చేసిన ఈ కుటుంబం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
ఇంటర్నె్ట్ డెస్క్: విమానంలో ఫుడ్ అంటే స్నాక్ లేదా మీల్ అందుబాటులో ఉంటాయి. కానీ.. ఓ కుటుంబం మాత్రం విమానాన్ని ఏకంగా క్యాంటిన్‌గా మార్చేసింది. ఇండిగో విమానం క్యాబిన్‌లో ఓ కుటుంబం ఆహారాన్ని వడ్డించుకుని తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ డిస్పోజబుల్ ప్లేట్లను తెరిచి కుటుంబ సభ్యులకు సమోసాలు, ధోక్లా, తేప్లా, నమ్‌కీన్ మిశ్రమాలు, సాస్‌లు వంటి పలు రకాల ఆహారాన్ని వడ్డించడం కనిపించింది. ప్రయాణికులు తమ సీట్లలోనే భోజనం చేస్తుండగా.. కొందరు ప్లేట్లు పట్టుకుని క్యాబిన్‌లో తిరుగుతూ కనిపించారు. మరోవైపు.. కొంతమంది అమ్మాయిలు ప్రెస్-ఆన్ నెయిల్స్ వేసుకుంటూ కనిపించారు.
వీడియో చివర్లో ఆహారం వడ్డించిన మహిళ ఉపయోగించిన డిస్పోజబుల్ ప్లేట్లు.. ఇతర వ్యర్థాలను పెద్ద చెత్త సంచిలో సేకరిస్తూ కనిపించింది. దీంతో కుటుంబం తమ వ్యర్థాలను తామే శుభ్రం చేసిందని కొందరు ప్రశంసించగా.. విమాన క్యాబిన్‌లో ఇంత పెద్ద విందు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని మరికొందరు విమర్శించారు. కొందరు ఈ ఘటనను సరదాగా తీసుకుని కుటుంబం చేసిన ఏర్పాట్లపై నవ్వుకుంటే.. మరికొందరు విమాన ప్రయాణంలో పాటించాల్సిన క్యాబిన్ మర్యాదలపై ప్రశ్నలు లేవనెత్తారు. కాకపోతే.. వైరల్ వీడియోకు సంబంధించి ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు వేదికగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’
For AP News And Telugu News