ఫోన్ లాక్కుని పరార్.. దొంగను అక్కాచెల్లెళ్లు ఏం చేశారంటే.?
ABN , Publish Date - Aug 10 , 2026 | 08:21 AM
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయిన దొంగను స్కూటర్‌పై వెంబడించి, అతడి బైక్‌ను ఢీకొట్టి పట్టుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గ్వాలియర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అసాధారణ ధైర్యం చూపించారు. మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయిన దొంగను స్కూటర్‌పై వెంబడించి, బైక్‌ను ఢీకొట్టి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పడావ్ ప్రాంతంలోని సోఫా గ్యాలరీ సమీపంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి.. వెనుక కూర్చున్న ఆమె చేతిలోని మొబైల్‌ను లాక్కొని వేగంగా పారిపోయాడు. అయితే అక్కాచెల్లెళ్లు ఏమాత్రం భయపడకుండా అతడిని స్కూటర్‌పై వెంబడించారు. రద్దీగా ఉండే రోడ్లపై సుమారు 80 కిలోమీటర్ల వేగంతో ఛేజ్ చేసినట్లు సమాచారం.
ఫూల్‌బాగ్ సమీపంలో నిందితుడి బైక్‌కు టెంపో అడ్డురావడంతో అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కాచెల్లెళ్లు తమ స్కూటర్‌తో అతడి బైక్‌ను ఢీకొట్టడంతో నిందితుడు కిందపడిపోయాడు. వెంటనే అతడిని పట్టుకుని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన అక్కాచెల్లెళ్ల ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..
ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!