వరద నీటిలో ప్రాణాలు కాపాడుకున్న ఎలుక.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 09 , 2026 | 09:57 AM
ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని నవ్విస్తుంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని నవ్విస్తుంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. నీటిలో చిక్కుకుపోయిన ఓ ఎలుక.. తన ప్రాణాలను కాపాడుకుంది. అందుకు కాలుకు వేసుకునే చెప్పును ఆసరాగా చేసుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చుట్టూ నీటితో నిండి ఉంది. ఆ ప్రాంతం వర్షం లేదా వరద నీరుతో నిండిపోయింది.
అక్కడే ఉన్న షాపుల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీటి మధ్యలో ఓ చిన్న ఎలుక కనిపిస్తుంది. అది ఎర్రటి చెప్పుపై కూర్చుని ఉంది. ఆ చెప్పు నీటిలో తేలుతూ.. నెమ్మదిగా కదులుతుంది. ఎక్కడ కింద పడకుండా.. ఎలుక చాలా బ్యాలెన్సింగ్‌గా చెప్పుపై కూర్చుంది. దీనిని చూస్తుంటే.. వరద నీటిలో చిక్కుకున్నప్పుడు అది ఆ చెప్పునే పడవగా మార్చుకుని దానిపై ప్రయాణిస్తుంది. ఈ వీడియోను @BibhutiSharan9 అనే అకౌంట్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
నీటిలో మునిగిపోతున్న మనిషికి ఆసరాగా ఓ చెక్క కావాలి, అలాగే మునిగిపోతున్న ఎలుకకు ఆసరాగా ఒక చెప్పు కావాలి అని రాసి ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఎలుక తెలివిని ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఈ కథలో చెప్పునే అసలైన హీరోగా అభివర్ణిస్తున్నారు. ఈ ఎలుక కష్టకాలంలో మనుషులకు ఓ పెద్ద గుణపాఠం నేర్పిందని అంటున్నారు.