Share News

ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:35 PM

ఇటీవలి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ (కుదుపులు) ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఉదంతం అనంతరం నిర్వహించిన డోప్ టెస్టులో ప్రధాన పైలట్ ఫెయిల్ అయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!
Air India Turbulance Incident

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ (కుదుపులు) ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఉదంతం అనంతరం నిర్వహించిన డోప్ టెస్టులో ప్రధాన పైలట్ ఫెయిల్ అయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పైలట్‌ నుంచి సేకరించిన నమూనాల్లో మెదడుపై ప్రభావం చూపించే సైకోయాక్టివ్ పదార్థాలు ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎయిర్‌ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ టెస్టు అనంతరం ప్రధాన పైలట్‌కు మరో పరీక్ష నిర్వహించినట్టు కూడా తెలిసింది. ఈ టెస్టు ఫలితం ఇంకా వెలువడాల్సి ఉంది.


ఆగస్టు 7న థాయ్‌లాండ్‌ను ఢిల్లీకి వస్తున్న విమానం మార్గమధ్యంలో తీవ్ర టర్బులెన్స్‌కు లోనైంది. ఎత్తున ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా కిందకు దిగింది. ఘటన సమయంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. దాదాపు ఐదు నిమిషాల పాటు విమానం కుదుపులకు లోనైనట్టు తెలిసింది. టర్బులెన్స్ కారణంగా 13 మంది ప్యాసింజర్లు, నలుగురు సిబ్బంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు సిబ్బందికి మెడ, నడుము కింద భాగంలో కూడా గాయాలైయ్యాయి. అయితే, ఆస్పత్రిలో చికిత్స అనంతరం అందరూ డిశ్చార్జ్ అయ్యారు. టర్బులెన్స్ సమయంలో గాయాలపాలైనా ధైర్యంగా వ్యవహరించిన సిబ్బందిని విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు ప్రశంసించారు.


ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డు డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, విమానం ల్యాండైన అనంతరం నిర్వహించిన డోప్ టెస్టులో ప్రధాన పైలట్ దేహంలో సైకోయాక్టివ్ డ్రగ్స్ ఉన్నట్టు కథనాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తలనూ చదవండి:

నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..

2024లోనే పేపర్ లీక్.. ఝార్ఖండ్‌‌లో తెరపైకి సీఐడీ రిపోర్టు

Updated Date - Aug 09 , 2026 | 01:43 PM