Share News

నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:17 PM

బాలీవుడ్ సీనియర్ దర్శకుడు షకీల్ నూరానీ అరెస్ట్ అయ్యారు. షకీల్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..
Shakeel Noorani Arrested

ముంబై, ఆగస్టు 9: బాలీవుడ్ సీనియర్ దర్శకుడు షకీల్ నూరానీ అరెస్ట్ అయ్యారు. షకీల్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. 2016లో లోఖండ్‌వాలాలో జరిగిన ఓ అవార్డు వేడుకలో దర్శకుడు షకీల్ నూరానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశం కోసం తనను సంప్రదించమని షకీల్ ఆమెకు చెప్పారు.


కొన్ని రోజుల తర్వాత కొత్త ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ రీడింగ్ చేయాలని నమ్మించి ఆమెను మాల్వానిలోని తన నివాసానికి పిలిపించారు. ఇంటికి వెళ్లిన ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చారు. ఆ కూల్‌డ్రింక్ తాగిన బాధితురాలు స్పృహకోల్పోయింది. షకీల్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్నంతా వీడియో తీశారు. ఆ వీడియోను చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు.


పోలీసులకు, కుటుంబసభ్యులకు విషయం చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించారు. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. రోజురోజుకు అతడి వేధింపులు పెరగటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శనివారం షకీల్‌ను అరెస్ట్ చేసి, బొరివలి హాలిడే కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం షకీల్‌కు ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీ విధించింది.


ఇవి కూడా చదవండి

హిందూ సమాజమంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం: బండి సంజయ్

2024లోనే పేపర్ లీక్.. ఝార్ఖండ్‌‌లో తెరపైకి సీఐడీ రిపోర్టు

Updated Date - Aug 09 , 2026 | 01:19 PM