Share News

బంగారంతో రహదారి.. దుబాయ్‌లో గోల్డ్ వాక్‌వే రెడీ!

ABN , Publish Date - Oct 26 , 2026 | 07:50 PM

బంగారంతో తయారు చేసిన నడకమార్గాన్ని ఎక్కడైనా చూశారా..? దానిపై ఎప్పుడైనా నడిచారా..?

బంగారంతో రహదారి.. దుబాయ్‌లో గోల్డ్ వాక్‌వే రెడీ!
ఏఐతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నెట్ డెస్క్: బంగారంతో తయారు చేసిన నడకమార్గాన్ని ఎక్కడైనా చూశారా..? దానిపై ఎప్పుడైనా నడిచారా..? మీకు ఈ వింత అనుభూతిని ఇవ్వడానికి దుబాయ్ సిద్ధమవుతోంది. ప్రపంచంలోని మొట్టమొదటి ‘గోల్డ్ వాక్‌వే’ను త్వరలోని అందుబాటులోకి తేనుంది. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో నిర్మించటం మరో విశేషం. ఇప్పటికే ఆ దేశం ‘గోల్డ్ డిస్ట్రిక్ట్’ నిర్మించి పర్యాటకులతో దాసోహం అనిపిస్తోంది. ఇప్పుడు బంగారు నడకమార్గంతో అందరినీ ఆశ్చర్యపరచనుంది. 2026 చివరినాటికి ఈ గోల్డ్ వాక్‌వేను ప్రారంభిస్తామని దుబాయ్‌ గోల్డ్‌ డిస్ట్రిక్‌ కమర్షియల్‌ సెక్టార్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రషీద్‌ అల్‌ హర్మౌదీ వెల్లడించారు. దీనిపై నడుస్తూ పర్యాటకులు గోల్డ్ డిస్ట్రిక్ట్ సొగసులను తిలకించవచ్చని ఆయన చెబుతున్నారు.


త్వరలో గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో బంగారు ఆభరణాల భారీ ఎగ్జిబిషన్ కూడా పెట్టడానికి సన్నహాలు చేస్తున్నామని రషీద్‌ అల్‌ హర్మౌదీ తెలిపారు. పసిడి వర్తకంలో దుబాయ్‌ను గ్లోబల్ హబ్‌గా చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రముఖ జ్వువెలరీ సంస్థ జోయాలుక్కాస్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు కమ్మలను తయారు చేసి ప్రదర్శించింది. ఈ కళాఖండానికి రెండు గిన్నిస్ రికార్డులూ దక్కాయి.


ఈ వార్తలూ చదవండి

వివాహ బంధంపై కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన విజయ్, రష్మిక

కొత్త కారు ఇంటి ముందు పార్కింగ్.. తెల్లారేసరికి..

Updated Date - Oct 26 , 2026 | 07:54 PM