కొత్త కారు ఇంటి ముందు పార్కింగ్.. తెల్లారేసరికి..
ABN , Publish Date - Oct 25 , 2026 | 10:15 PM
అవతలి వారి ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేరు. ఏ రకంగానైనా ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఓ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అవతలి వారి ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేరు. ఏ రకంగానైనా ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఓ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొత్త కారును తన ఇంటి ముందు రాత్రంతా పార్క్ చేసుకున్న వ్యక్తికి తగిలిన షాక్ గురించి ఓ నెటిజన్ నెట్టింట పంచుకున్నారు. తెల్లారాక చూస్తే కారుపై పెయింట్ పోయేలా గీతలు కనిపించాయని చెప్పారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
‘కొత్త కారును ఇలా చేయడం దారుణం. ఇలాంటి పని చేసిన వ్యక్తికి కారు ఓనర్‌తో ఏదైనా గొడవ ఉందేమో. ఇక్కడ కనిపిస్తున్న దాని కంటే వ్యవహారం ఎక్కువే ఉంది’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. అవతలి వారి వస్తువుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండటం ఈ మధ్య తగ్గిపోతోందని కొందరు చెప్పారు. పిల్లలు ఇలా చేసుంటే మాత్రం తప్పంతా తల్లిదండ్రులదే అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. వారిని కూడా శిక్షించాలని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
తనను అన్యాయంగా తొలగించిన సంస్థ చిక్కులు పడటం చూస్తే నవ్వొస్తోందని ఓ నెటిజన్ పెట్టిన పోస్టు కూడా ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. తమ టీమ్‌లోని ఓ వ్యక్తి చెప్పుడు మాటలు విని తనను తొలగించారని ఆ నెటిజన్ చెప్పారు. తరువాత ఆ వ్యక్తి తనే స్వయంగా బాధ్యతలు చేపట్టి చివరకు విఫలమయ్యారని తెలిపారు. చివరకు ఆ వ్యక్తి నెపాన్ని ఇతరులపైకి నెట్టడం ప్రారంభించారని అన్నారు. దీంతో, పనివాతావరణం చెడిపోయిందని చెప్పారు. ఆ వ్యక్తి తీరుతో విసిగిన అనేక మంది కంపెనీని వీడారని చెప్పారు. ఒకప్పుడు 14 మంది సభ్యులున్న టీంలో ప్రస్తుతం నలుగురే మిగిలిన వైనం చూస్తే నవ్వొస్తోందని పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై కూడా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:
గంగవరం బీచ్ అందాలు.. ఆనంద్ మహీంద్రా ఫిదా
రెండేళ్లకే తబలాపై 12 తాళాలు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కర్ణాటక చిన్నారి