Share News

గంగవరం బీచ్‌‌ అందాలు.. ఆనంద్ మహీంద్రా ఫిదా

ABN , Publish Date - Oct 25 , 2026 | 09:53 PM

వైజాగ్‌కు సమీపంలోని గంగవరం బీచ్‌పై ఆనంద్ తాజాగా పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

గంగవరం బీచ్‌‌ అందాలు.. ఆనంద్ మహీంద్రా ఫిదా
Anand Mahindra Comments on Gangavaram Beach

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఆస్తికర విషయాలను తెలుసుకుని నెటిజన్లతో పంచుకునే వ్యక్తుల్లో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా టాప్‌లో ఉంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా వైజాగ్‌‌కు సమీపంలోని గంగవరం బీచ్‌ గురించి ప్రస్తావించారు. పలు ఫొటోలను షేర్ చేశారు. బీచ్ అందాలకున్న కొత్త కోణాన్ని వివరించారు. ‘ఈ బీచ్‌ గురించి మన దేశంలో జనాలు ఎక్కువగా ఎందుకు చర్చించుకోవట్లేదు? జనాల్లో అంత ఆసక్తి ఎందుకు లేదు?’ అని ఆయన ప్రశ్నించారు.


బీచ్‌ అంటే సాధారణంగా అందరికీ తీరం వెంబడి ఉండే కొబ్బరి చెట్లు గుర్తుకు వస్తాయని ఆనంద్ మహీంద్రా అన్నారు. కానీ గంగవరం బీచ్‌‌లో మాత్రం అలాంటి సీన్స్ కనిపించవని చెప్పారు. ‘ఎత్తైన రాతి కొండలు, ఎగుడుదిగుడులతో కఠినంగా కనిపించే నేల వంటివి చూస్తే.. చరిత్ర పూర్వయుగం నాటి ప్రపంచం చూస్తున్నట్టు ఉంటుంది’ అని ఆయన కామెంట్ చేశారు. ఇలాంటి ప్రకృతి దృశ్యాలు తనను అమితంగా ఆకర్షిస్తాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రదేశాల్లో సమయం గడిపితే రిలాక్స్ అవడంతో పాటు మనసుల లోలోపలకు తొంగి చూసుకునే స్థితి ఉంటుందని అన్నారు.


వైజాగ్‌లో ప్రస్తుతం రెండు భిన్నమైన పరిస్థితుల గురించి కూడా మస్క్ ప్రస్తావించారు. డేటా సెంటర్లు, ఇతర ఏఐ మౌలిక వ్యవస్థలతో అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక నగరానికి మరోవైపు ఆశ్చర్యం కలిగించే ప్రకృతి అందాలు ఉన్నాయని అన్నారు. ఈ పోస్టుకు ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

రెండేళ్లకే తబలాపై 12 తాళాలు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కర్ణాటక చిన్నారి

మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..

Updated Date - Oct 25 , 2026 | 09:54 PM