వివాహ బంధంపై కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన విజయ్, రష్మిక
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:22 PM
తమ వివాహ బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు నటులు విజయ్ దేవరకొండ, రష్మిక గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ వివాహ బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు నటులు విజయ్ దేవరకొండ, రష్మిక గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. ఈ మేరకు ఇద్దరూ వేర్వేరు పోస్ట్‌లు పెట్టి.. సోషల్ మీడియాలోని నెగిటివ్ కామెంట్లను కొట్టిపడేశారు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ జంట పొల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలని రష్మిక తనను వంద సార్లు అడిగిందని చెప్పారు. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించటం మొదలుపెట్టారు.
విమర్శల తాకిడి ఎక్కువయ్యే సరికి రష్మిక, విజయ్ వీటిపై స్పందించారు. పెళ్లి ప్రాతిపాదన తెచ్చినప్పుడు విజయ్ సమయం తీసుకోవడంలో తప్పు లేదని రష్మిక పోస్ట్ చేశారు. ‘వివాహానికి సంబంధించిన నిర్ణయాలకు సమయం అవసరం. అలాగే నాకు విజయ్ అంటే పిచ్చి ప్రేమ. ఇందులో ఏం తప్పు ఉంది? ప్రేమే ఉండకపోతే నేను ఆయనను ఎందుకు వివాహమాడతాను’ అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఈ నెగిటివ్ కామెంట్లపై స్పందించారు. ఎవరి పని వారు చూసుకోవాలంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. ‘రష్మిక నా భార్య.. నా స్నేహితురాలు.. నా జీవిత భాగస్వామి. మా ఇద్దరి జీవితాలూ సంతోషంతో నిండిపోయాయి’ అని ఆయన పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి
‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనవడి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని