యానాంపై ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావం.. పుదుచ్చేరి సర్కార్ అలర్ట్
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:03 PM
అర్నబ్ తుఫాన్ ప్రభావం యానాంపై అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజా పనులను శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.. పుదుచ్చేరి నుంచి యానాం చేరుకున్నారు.
కాకినాడ జిల్లా (యానాం), అక్టోబర్ 26: అర్నబ్ తుఫాన్ ప్రభావం యానాంపై అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజా పనులను శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.. పుదుచ్చేరి నుంచి యానాం చేరుకున్నారు. యానాం ప్రాంతీయ పరిపాలన అధికారి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అర్నబ్ తుఫాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు యానాం అన్ని శాఖలను మంత్రి మల్లాడి అప్రమత్తం చేశారు. యానాంలో రెండు రోజుల పాటు పాఠశాలకు పుదుచ్చేరి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అధికారులతో కలిసి తీరప్రాంత గ్రామాలను, తుఫాన్ షెల్టర్లను మంత్రి పరిశీలించనున్నారు. ఈరోజు సాయంత్రానికి రెండు ఎన్డీఆర్ఎప్ బృందాలు యానాం చేరుకోనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడింది. రేపు(మంగళవారానికి) ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా, ఎల్లుండి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈనెల 28న విశాఖపట్నం-మచిలీపట్నం మధ్య (కాకినాడకు దక్షిణాన యానాం వద్ద) తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి 40 ఏళ్లు.. వైద్య విద్యలో ఏఐ, పరిశోధనలకు గవర్నర్ పిలుపు
వాల్మీకి, బోయల అభ్యున్నతికి కృషి: మంత్రి సవిత
Read Latest AP News And Telugu News