భార్యను అసభ్యంగా పట్టుకున్నాడని.. భర్తకు ఎంత కోపం వచ్చిందంటే.. ఒక్క పంచ్‌తో..
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:36 PM
తన భార్యను అసభ్యంగా పట్టుకున్న ఓ వ్యక్తికి ఆమె భర్త దిమ్మదిరిగే పంచ్ ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తన భార్యను అసభ్యంగా పట్టుకున్న ఓ వ్యక్తికి ఆమె భర్త దిమ్మదిరిగే పంచ్ ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియోలో ఒక జంట బార్‌లో పూల్ గేమ్ ఆడుతోంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళ దగ్గరకు వచ్చి ఆమెను అనుచితంగా తాకినట్లు వీడియోలో కనిపిస్తోంది (Drunk man gropes woman).
తన భార్యను అసభ్యంగా తాకడంతో ఆ భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వేగంగా దూసుకెళ్లి మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి మొహంపై ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆ దెబ్బకు ఆ వ్యక్తి నేల కూలిపోయాడు. మళ్లీ పైకి లేవలేదు. తన భర్తను కంట్రోల్ చేయడానికి వచ్చిన మహిళకు పూల్ స్టిక్ తగిలినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత బార్ సిబ్బంది వచ్చి అతడిని బయటకు వెళ్లమనడం కనిపిస్తోంది (Viral bar video).
ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు (Husband knocks man down). ఈ ఘటన మొత్తం ఆ బార్‌లోని సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భర్త చర్యను సమర్థిస్తూ.. భార్యను రక్షించడం కోసమే అలా చేశాడని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ వ్యక్తి అతిగా స్పందించాడని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..