Share News

కప్పలు కళ్లతో ఆహారాన్ని మింగుతాయా.. ఈ ఆశ్చర్యకర నిజం తెలుసా..

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:03 PM

మన ప్రకృతిలో ఉన్న చాలా జీవుల్లో కప్పలు చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా అవి నేల మీద, నీటిలోనూ నివసించగలిగే ఉభయ చర జీవులు. చాలా మందికి తెలియని మరో విశేషమేమిటంటే.. అవి ఆహారం తినే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

కప్పలు కళ్లతో ఆహారాన్ని మింగుతాయా.. ఈ ఆశ్చర్యకర నిజం తెలుసా..
Frogs swallowing with eyes

మన ప్రకృతిలో ఉన్న చాలా జీవుల్లో కప్పలు చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా అవి నేల మీద, నీటిలోనూ నివసించగలిగే ఉభయ చర జీవులు. చాలా మందికి తెలియని మరో విశేషమేమిటంటే.. అవి ఆహారం తినే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కప్పలు తమ కళ్ల సహాయంతో ఆహారాన్ని మింగుతాయి. కప్ప శరీర నిర్మాణం వల్లే ఇలా జరుగుతుంది (Frogs swallowing with eyes).


నిజానికి కప్ప ఆహారాన్ని నమలలేదు. దానిని నేరుగా మింగడానికి ప్రయత్నిస్తుంది. కప్ప ఒక పురుగును లేదా చిన్న జీవిని పట్టుకున్న తర్వాత, వెంటనే దాన్ని నమలకుండా మింగేస్తుంది. ఆ సమయంలో కప్ప తన కళ్లను లోపలికి నెడుతుంది. కళ్ల కింద ఉండే కండరాలు ఆహారాన్ని గొంతులోకి నెట్టడంలో సహాయపడతాయి. కళ్ల బంతులు తలలోకి దిగుతూ ఆహారాన్ని లోపలికి పంపిస్తాయి. కప్పలకు పళ్లు ఉండవు. అవి ఆహారాన్ని నమలలేవు. అందుకే ఆహారాన్ని సులభంగా మింగేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తాయి (How frogs eat food).


కప్పల తల పైభాగం, కళ్ల మధ్య గట్టి ఎముకలు ఉండవు. అక్కడ సాగే గుణం గల కణజాలం ఉంటుంది (Frog feeding mechanism). ఆ కణజాలం కళ్లను నోటిలోకి లాక్కోవడానికి వీలు కల్పిస్తుంది. కప్ప నాలుక నోటి ముందు భాగానికి అతుక్కొని ఉంటుంది. అది ఎరను పట్టుకోవడానికి చాలా సహాయపడుతుంది. కానీ, పట్టుకున్న ఆహారాన్ని గొంతులోకి పంపించడంలో సహాయపడలేదు. అందుకే కను గుడ్ల వెనుకున్న కండరాల సహాయంతో ఆహారాన్ని గొంతులోకి పంపిస్తాయి.


ఇవి కూడా చదవండి..

దక్షిణాదికి ముందుంది ముప్పు!

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 19 , 2026 | 02:03 PM