Share News

అంగన్‌వాడీ నిర్లక్ష్యం.. గర్భిణికి ఇచ్చిన పోషకాహారంలో చనిపోయిన పాముపిల్ల.!

ABN , Publish Date - Jun 07 , 2026 | 04:49 PM

మధ్యప్రదేశ్‌లో ఓ గర్భిణికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెకు ఎదురైన ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే...

అంగన్‌వాడీ నిర్లక్ష్యం.. గర్భిణికి ఇచ్చిన పోషకాహారంలో చనిపోయిన పాముపిల్ల.!

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌ పాందుర్నా జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెకు ఇచ్చిన పోషకాహార ప్యాకెట్‌లో చనిపోయిన పాముపిల్ల కనిపించడం కలకలం రేపింది. అసలేం జరిగిందంటే...


కర్ఘాట్ కామ్తీ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో లడ్డూలతో కూడిన పోషకాహార ప్యాకెట్లు అందజేశారు. అందులో ఓ గర్భిణికి ఇచ్చిన ప్యాకెట్లో చనిపోయిన పాముపిల్ల ప్రత్యక్షమైంది. అయితే.. అదృష్టవశాత్తూ ఆమె ఆ ఆహారాన్ని తీసుకోలేదు. చనిపోయిన ఆ పాముపిల్లను చూసి కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ విషయమై వెంటనే అంగన్‌వాడీ సిబ్బంది సహా స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రాథమిక పరిశీలన నిర్వహించి ఓ స్టేట్‌మెంట్ సిద్ధం చేశారు.


ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అగ్రిమ్ కుమార్.. ఐదుగురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. సదరు ఆహార నమూనాలను సేకరించి భోపాల్‌లోని రాష్ట్ర ఆహార పరీక్షా కేంద్రానికి పంపారు. ల్యాబ్ రిపోర్ట్, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే పోషకాహార పదార్థాలపై ఎప్పటికప్పుడు తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

గల్ఫ్‌లో మలయాళీ నర్సుల కష్టాలు.. పీఎం సాయం కోరిన సీఎం

హెడ్‌ఫోన్సా.. ఇయర్‌బడ్సా? చెవులకు ఏది మేలు.!

Updated Date - Jun 07 , 2026 | 04:55 PM