Share News

చూస్తే నిజమైన చేపే అనుకుంటారు.. కానీ!

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:36 PM

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు, జంతువులు, పక్షులను పోలిన రోబోట్‌లను తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు ఇప్పుడు జలచరాలను కూడా తయారు చేస్తున్నారు.

చూస్తే నిజమైన చేపే అనుకుంటారు.. కానీ!
Bionic Fish Robot

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు, జంతువులు, పక్షులను పోలిన రోబోట్‌లను తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు ఇప్పుడు జలచరాలను కూడా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన ఓ బయోనిక్ ఫిష్ రోబోట్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని రోబోట్ అని గుర్తించడం కూడా కష్టమే. అచ్చం నిజమైన చేపలా కనిపించే ఈ రోబోట్.. నీటిలో అచ్చం చేప తరహాలోనే సహజంగా ఈదుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి నీటితో నిండిన తొట్టిలో ఈ రోబోటిక్ చేపను వేయగా.. అది నిజమైన చేప మాదిరిగానే నీటిలో ఈదుతూ కనిపించింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఈ బయోనిక్ ఫిష్ రోబోట్‌ను రూపొందించే సమయంలో శాస్త్రవేత్తలు నిజమైన చేపల సహజ కదలికలను నిశితంగా అధ్యయనం చేశారట. చేపలు నీటిలో ప్రయాణించేటప్పుడు శరీరం, తోకను ఎలా కదిలిస్తాయి, దిశను ఎలా మార్చుకుంటాయి అనే అంశాలను ఆధారంగా చేసుకుని రోబోట్‌ను రూపొందించారు. కేవలం చేప ఆకారాన్ని అనుకరించడం మాత్రమే కాకుండా, నీటి అడుగున సమర్థంగా పనిచేసేలా దీన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి బయోనిక్ జలచర రోబోట్‌లను నీటి అడుగున పరిశోధనలు, సముద్ర జీవుల పరిశీలన, పర్యావరణ అధ్యయనాలు వంటి రంగాల్లో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని సాంకేతిక రంగ నిపుణులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుజరాత్ తీరంలో రెండు వాణిజ్య నౌకలు ఢీ.. రంగంలోకి దిగిన తీర రక్షక దళం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1లో కొత్త సర్వీసులు
For More Weather News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 12:50 PM