ఆకాశంలో మేఘాలను చూస్తే చాలు.. నెలకు రూ.8.5 లక్షలకు పైగా జీతం..
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:40 PM
సాధారణంగా ఉద్యోగం అంటే కార్యాలయానికి వెళ్లడం, కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయడం లేదా శారీరక శ్రమ చేయడం గుర్తుకొస్తుంది. కానీ చైనాలో యువతను ఆకర్షిస్తున్న ఓ ఉద్యోగం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
సాధారణంగా ఉద్యోగం అంటే కార్యాలయానికి వెళ్లడం, కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయడం లేదా శారీరక శ్రమ చేయడం గుర్తుకొస్తుంది. కానీ చైనాలో యువతను ఆకర్షిస్తున్న ఓ ఉద్యోగం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆకాశంలో మేఘాలను పరిశీలిస్తూ వాటి మార్పులను గమనించడమే ఈ ఉద్యోగం. అందుకు నెలకు రూ.8.5 లక్షలకు పైగా జీతం అందుతుండటంతో ఈ ఉద్యోగం ఇప్పుడు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తోంది (China cloud watching job).
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న లావోజున్ పర్వతంపై క్లౌడ్ అబ్జర్వర్ పోస్టును ప్రకటించారు. ఈ ఒక్క పోస్టు కోసం 3,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. 'క్లౌడ్ వాచింగ్' అంటే ఆకాశంలో కనిపించే మేఘాలను పరిశీలించడం. వాటి ఆకారం, కదలికలు, రంగు, మార్పులను గమనించడం. అయితే ఈ ఉద్యోగం చేయడం అనుకున్నంత సులభం కాదు. వాస్తవానికి ఇది ఒక కఠోరమైన మారథాన్ లాంటిదని ఇప్పటికే ఈ ఉద్యోగం చేస్తున్న 22 ఏళ్ల లీ సిచెన్ తెలిపాడు (Cloud watching salary).
ఈ ఉద్యోగంలో భాగంగా లావోజున్ పర్వతం పై నుంచి దట్టమైన మేఘాలను పరిశీలించాల్సి ఉంటుంది (China unusual jobs). అతడి రోజు ఉదయం 4:50 గంటలకు మొదలవుతుంది. చేతిలో కెమెరాతో ఉదయాన్నే పర్వతం పైకి చేరుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చిత్రీకరణ చేయాలి.
వానైనా, ఎండైనా ప్రతిరోజూ కనీసం ఒక ఒరిజినల్ షార్ట్ వీడియోను పోస్ట్ చేయాలి. కొన్నిసార్లు ఒక పర్ఫెక్ట్ షాట్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. పర్వతాలలో వేగంగా మారుతున్న ఉష్ణోగ్రతలు, బలహీనమైన మొబైల్ సిగ్నల్ కష్టాలను మరింత పెంచుతాయి. తన ఉద్యోగ అనుభవాన్ని ఒక చిత్రహింసగా, అత్యంత కష్టమైనదిగా లీ వర్ణించాడు.
ఇవి కూడా చదవండి..
యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్
డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..