Share News

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:47 PM

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్
PhonePe

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI) చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో, డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు (UPI payments free).


యూపీఐ లావాదేవీలపై భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుమునూ వసూలు చేయబోమని సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని, డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. యూపీఐ వ్యవస్థను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచితంగానే కొనసాగించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు (PhonePe CEO Sameer Nigam).


యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ విధించేందుకు చట్టపరమైన అవకాశం కల్పించే మార్పులపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది (UPI charges India). అయితే రుసుము విధించే తుది విధానం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని ప్రతిపాదనల్లో నిర్దిష్ట విలువకు మించిన లావాదేవీలు లేదా నిర్దిష్ట వార్షిక వ్యాపార పరిమాణం కలిగిన వ్యాపారులపై మాత్రమే రుసుము విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 08 , 2026 | 03:49 PM