Share News

పిల్లలను బైక్‌పై ఇలా కూడా తీసుకెళ్లవచ్చా.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:03 PM

వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తారు. ఆ ట్రాఫిక్ రూల్స్‌ అతిక్రమించిన వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం.

పిల్లలను బైక్‌పై ఇలా కూడా తీసుకెళ్లవచ్చా.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తారు. ఆ ట్రాఫిక్ రూల్స్‌ అతిక్రమించిన వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. వాహనంపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని ట్రాఫిక్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వృద్ధుడు తన బైక్‌పై చాలా మంది చిన్నారులతో వెళ్తున్నాడు.


బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌పై పిల్లలను కూర్చో బెట్టుకున్నాడు. అలాగే చాలా మంది పిల్లలు అతడి వెనక సీట్లో కూర్చొని ఉన్నారు. ఇక బైక్ ఇరు వైపులా ఉన్నా ఫుట్ రెస్ట్‌పై పిల్లలు నిలబడి ఉన్నారు. బైక్‌పై ఉన్న పిల్లలందరి వద్ద పుస్తకాల బ్యాగ్‌లు ఉన్నాయి. బైక్‌పై దాదాపు 6 నుంచి ఏడుగురు చిన్నారులు కూర్చొని ఉన్నారు. ఆ చిన్నారులను ఆ వృద్ధుడు తన బైక్‌‌పై స్కూల్‌కు తీసుకెళ్తున్నట్లు ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఈ బండి నంబర్ ప్లేట్‌ను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉంది.


ఈ వీడియోను arshad_khan_886906 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి.. లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ బైక్‌ను స్కూల్ బస్సుగా మార్చేశాడని ఒకరు పేర్కొన్నారు. ఇది తక్కువ సీట్లు, ఎక్కువ మంది ప్రయాణికులతో ఉన్న దేశీ విమానం అని మరోకరు అభివర్ణించారు.


ఈ వీడియో చూడటానికి చాలా వినోదాత్మకంగా, హాస్యభరితంగా ఉందని.. దీంతోపాటు ప్రమాదం కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ బైక్‌పై ఇంతమంది పిల్లలను కూర్చోబెట్టడం ప్రమాదాలను ఆహ్వానించడమేనని పేర్కొన్నారు. ఇలా ఓవర్‌లోడింగ్ చేయడం వల్ల పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Sep 25 , 2026 | 03:13 PM