Share News

ఫొటో కోసం ఫోజు.. క్షణాల్లో మృత్యుఒడిలోకి..

ABN , Publish Date - Jul 01 , 2026 | 03:54 PM

బ్రెజిల్‌లో ఫొటో కోసం పోజులిచ్చిన కొద్ది క్షణాలకే ఓ పర్వతారోహకుడు సుమారు 500 అడుగుల లోతులో పడిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు కెమెరాలో రికార్డవ్వడంతో తీవ్ర కలకలం రేపుతోంది.

ఫొటో కోసం ఫోజు.. క్షణాల్లో మృత్యుఒడిలోకి..
Brazil hiking accident

ఇంటర్నెట్ డెస్క్: ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరూ ఊహించలేరు. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఫొటో దిగేందుకు చేసిన ప్రయత్నం ఓ పర్వతారోహకుడి ప్రాణాలను బలితీసుకుంది. బ్రెజిల్‌లోని రియో డి జనీరో సమీపంలోని మారికా ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పెడ్రా డో మకాకో ట్రైల్ వద్ద ఫొటో కోసం ఫోజులిచ్చాడు. అనుకోకుండా పట్టు తప్పి సుమారు 500 అడుగుల లోతులో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు.. కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదకరమైన ప్రదేశంగా పేరున్నప్పటికీ, ఆ రాతి‌పై నుంచి కనిపించే సరస్సులు, ప్రకృతి అందాలను వీక్షించేందుకు, ఫొటోలు దిగేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తుంటారు.


స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మృతుడు అరబల్ కిందకు దిగుతున్న సమయంలో సహచర పర్వతారోహకుడు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించినప్పటికీ, క్షణాల్లోనే అతను కాలు జారి సుమారు 152 మీటర్ల లోతులోకి పడిపోయాడు. అతను కిందపడుతున్న దృశ్యాలతో పాటు అక్కడున్న వారి ఆందోళన, అరుపులు కూడా వీడియోలో రికార్డయ్యాయి. అరబల్‌కు అధికారిక గైడ్ లైసెన్స్ లేకపోయినా హైకర్ల బృందానికి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. నిటారుగా ఉన్న బండరాయిని.. ప్రమాదకరమైన వైపు నుంచి దిగేందుకు ప్రయత్నించడంతో పట్టుతప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.


ఇవి కూడా చదవండి...

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల

సాయికృష్ణ కేసు.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 04:19 PM